ఆధునిక సమాజంలో ఏదైనా సమాచారం పంపాలన్న, సమాచారం పొందాలన్న ప్రతి ఒక్కరూ ఆన్‌లైన్ సేవలపై ఆధారపడుతున్నారు. ప్రస్తుతం పట్టణాలు, నగరాలతో పాటు, మారుమూల గ్రామాల్లో ఎక్కడ చూసిన ఉత్తరం అనే మాట మాయమైపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో ఉత్తరాల రూపంలో సమాచారాన్ని పంపేవారే కనిపించడం లేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం సమాజంలోని యువతతో పాటు, చిన్నారులకు పోస్టుకార్డులు, టెలీగ్రాం, ఇన్‌ల్యాండ్ లెటర్లు, రిజిష్టర్ పోస్టులు, స్పీడ్ పోస్టులు, పోస్టల్ స్టాంపుల వినియోగం గురించి అంతగా తెలియదు.
భావి తరాలను దృష్టిలో ఉంచుకొని, భారతీయ తపాల సంస్థ ఉత్తరాలపై నేటి తరానికి అవగాహన కల్పించడానికి ఒక ప్రయత్నాన్ని ప్రారంభించింది. దీంట్లో భాగంగానే మహాత్మాగాంధీ 150వ జయంతిని పురస్కరించుకొని జాతీయ స్థాయిలో ఉత్తరాల పోటీలను నిర్వహిస్తున్నది.